Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
YS Jagan Boycotts Andhrajyothi And ABN
గతంలో ప్రభుత్వంపై కల్పిత కథనాలు రాసినందుకు సాక్షి మీడియాను కొన్ని సమావేశాలకు టీడీపీ దూరంగా ఉంచిది. ఇందులో చంద్రబాబు పాత్ర లేకపోయినా.. వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆయన్నే విమర్శించారు. మరిప్పుడు వైసీపీ ప్లీనరీ లాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి అన్ని మీడియాల్ని పిలిచి.. ఆంధ్రజ్యోతిని వదిలేయడమేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. అదేమంటే జగన్ పాదాభివందనాన్ని రచ్చ చేశారని అపవాదు వేస్తున్నారు.
జగన్ పాదాభివందనం చేసింది రాష్ట్రపతి ప్రణబ్ కు అయితే సరిపెట్టుకునేవారు. కానీ కాబోయే రాష్ట్రపతి కోవింద్ కు అంత వినయం ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటన్నది చాలా మంది వైసీపీ ఎంపీలకే అంతుపట్టలేదు. పైగా కోవింద్ కు పాదాభివందనం.. ఢిల్లీకి వంగి ఉన్నామనే సంకేతాలు పంపుతోందని వారూ భయపడుతున్నారు. అదే విషయం ఆంధ్రజ్యోతి చెప్పింది. కానీ జగన్ కు ఇది నచ్చలేదు.
అందుకే మీడియా అక్రిడేషన్లు పరిశీలించే నెపంతో.. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధుల్ని బయటకు పంపారు. అయినా సరే యూట్యూబ్ లైవ్ ద్వారా ఏబీఎన్ లో ప్లీనరీ ప్రసారమైంది. ఈ మాత్రం దానికి జగన్ నిందల పాలయ్యారని వైసీపీ నేతలు మథనపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ను కూడా ప్లీనరీలో పరిచయం చేసిన జగన్.. అలాంటప్పుడు కూడా ఫ్యూడల్ మనస్తత్వాన్ని వదులుకోకపోతే ఎలాగని నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ కు మాత్రం ఇవేమీ పట్టవు. తాను చేస్తే సంసారం.. ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది పరిస్థితి.
మరిన్ని వార్తలు: