Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కి అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నట్టు వుంది పరిస్థితి. ఎటు వైపు నుంచి ఏ ఇబ్బంది ఎదురవుతుందో అని అధిష్టానం అల్లల్లాడుతోంది. అధికార పక్ష విమర్శల్ని తట్టుకోడానికి నానా అగచాట్లు పడుతుంటే ఇంతలో విజయవాడ వైసీపీ లో గౌతమ్ రెడ్డి, వంగవీటి రాధా వివాదం రచ్చ రేపింది. గౌతమ్ రెడ్డి సస్పెన్షన్ తో పరిస్థితి నార్మల్ కి వస్తుంది అనుకునే లోపే ఇంకో వార్త వైసీపీ అధినేత జగన్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైసీపీ నుంచి మరో ఆరుగురు అధికార టీడీపీ లోకి జంప్ కావడానికి రెడీ గా ఉన్నారన్న వార్త లోటస్ పాండ్ లో హీట్ పెంచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు చేజారితే ఏమవుతుందో జగన్ అండ్ కో కి బాగా తెలుసు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అలా జరక్కుండా చూసుకోడానికి, అవసరం అయితే ఓ మెట్టు దిగి అయినా బతిమాలాడానికి కూడా జగన్ రెడీ గా ఉన్నారట. అయితే అక్కడే సమస్య మొదలు అయ్యింది.
పార్టీ మారబోతున్న ఎమ్మెల్యేల్ని తానే నిలవరిస్తానని జగన్ తన సన్నిహితులతో చెప్పి రంగంలోకి దిగారట. ఆ ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలని పార్టీ పెద్దలని ఆదేశించారట. అయితే ఎంత వాకబు చేసినా ఆ ఆరుగురు ఎవరో వైసీపీ ముఖ్యులు తెలుసుకోలేకపోయారట. ఎవరిని అడిగినా మమ్మల్ని అనుమానిస్తున్నారా అన్న ప్రశ్న సమాధానంగా వస్తోందట. దీంతో ఏమి చేయాలో, జగన్ కి ఏ పేర్లు చెప్పాలో తెలియక వైసీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారట. ఈ పరిస్థితి చూస్తున్న ఓ పెద్దాయన ఓ చిన్న సెటైర్ వేసాడంట. ఇంకొన్ని రోజులు ఆగితే ఆ ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరతారు కదా అప్పుడు వారి పేర్లు జగన్ కి ఇద్దాం అని అన్నారట. ప్రస్తుతం వున్న పరిస్థితి అదే అయినా ఆ కామెడీ ని ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు లేరు. సాధ్యమైనంత త్వరలో జుంపింగ్ ఎమ్మెల్యేల లిస్ట్ జగన్ కి ఇవ్వాలని వారు వేట సాగిస్తున్నారు.
మరిన్ని వార్తలు: