Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కుమార్తె చదువుకి సంబంధించి లండన్ వెళ్లి వచ్చిన వెంటనే వైసీపీ అధినేత జగన్ శుక్రవారం ఎప్పటిలాగానే కోర్టుకి హాజరు అయ్యారు. క్విడ్ ప్రోకో కేసుల్లో ప్రతి శుక్రవారం ఆయన కోర్టు ముందు హాజరు కావడం ఎప్పటినుంచో సాగుతున్న ప్రక్రియ. ఈసారి కూడా ఆయన శుక్రవారం అలాగే కోర్టుకి వెళ్లారు. ఆయనతో పాటు ఈ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా కోర్టుకి హాజరు అయ్యారు. అయితే కోర్టు హాల్ దగ్గర ఈసారి ఓ దృశ్యం చాలా మందిని ఆశ్చర్యంలో పడేసిందట. ప్రతిసారి కోర్టుకి వచ్చినప్పుడు ఇదే కేసుల్లో వస్తున్న మిగతా వారిని జగన్ పెద్దగా పలకరించరు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురైతే నమస్కారంతో సరిపెడతారు. ఇక కేసులు పెట్టిన కొత్తల్లో గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియదని కూడా అనేసారు జగన్. అయితే గాలి మాత్రం జగన్ ని తమ్ముడితో సమానమని చెప్పారు. అయినా ఈ ఇద్దరూ ఆ తర్వాత నేరుగా కలుసుకోవడం తగ్గిపోయింది.
ఈ శుక్రవారం మాత్రం కోర్టు దగ్గర దొరికిన దాదాపు 45 నిమిషాల టైం ని జగన్, గాలి తమ చర్చలకు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. వీరి మధ్య ఏ చర్చలు జరిగింది బయటికి తెలియకపోయినా కొందరు ఊహిస్తున్న దాని ప్రకారం బీజేపీ ఇచ్చిన ఝలక్ మీదే మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. యెడ్యూరప్ప డైరెక్షన్ లో మళ్లీ కర్ణాటక బీజేపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావించిన గాలి, ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ జగన్ తో నడిచేలా పావులు కదిపారు. దానికి తగ్గట్టే పీఎం మోడీ అపాయింట్ మెంట్ దొరికింది జగన్ కి. ఆ తర్వాత బీజేపీ, మోడీ మీద జగన్ ఏ స్థాయిలో రాజభక్తి ప్రదర్శించారో, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ స్థాయిలోకమలనాధుల భజన చేశారో ప్రజలంతా చూసారు. ఆది నుంచి జగన్ వెంట నడిచిన క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ లు ముక్కున వేలేసుకున్నారు.పని అయిపోయాక కూడా చంద్రబాబు, జగన్ తో డ్యూయల్ గేమ్ ఆడిన బీజేపీ నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ప్లేట్ ఫిరాయించింది.
ఆ ఓటమి భారం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న జగన్ తన రహస్య స్నేహితుడు గాలితో భవిష్యత్ లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం మీద చర్చించఉండొచ్చు అనుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరికి వచ్చిన కర్ణాటక రాజకీయాల గురించి కూడా గాలి చెప్పారట. కర్ణాటకలోనూ చివరిలో కాంగ్రెస్ పుంజుకుంటోందని అందుకే బీజేపీ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని కూడా జగన్ కి గాలి ధైర్యం చెప్పారట. ఇకపై కాంగ్రెస్ ని బద్ధశత్రువుగా చూడొద్దని కూడా హితవు పలికాడట. కేసులు విచారణ ఊపు అందుకుంటున్న ఈ తరుణంలో ఏదో ఒక రాజకీయ పార్టీ అండ అవసరం అని కూడా గాలి సుద్దులు చెప్పి కాంగ్రెస్ తో అయినా సత్ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించాడట. ఈ సలహా జగన్ కి కూడా నచ్చిందట.