Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జగన్ అవినీతి కేసులతో జైల్లో కూర్చున్నప్పుడు అన్న వదిలిన బాణాన్ని అంటూ కాలికి బలపం కట్టుకు తిరిగి వైసీపీ ని నిలబెట్టింది చెల్లి షర్మిల. ఆ సుదీర్ఘ పాదయాత్ర టైం లో ఆమెకున్న రాజకీయ ఆశలు బాగానే బయటపడ్డాయి. ఆమె కడప ఎంపీ గా పోటీ చేయాలి అనుకున్నారు. అయితే జైలు నుంచి వచ్చాక జగన్ చెల్లిని పక్కన పెట్టేసారు. దీంతో ఆమె సైలెంట్ గా సైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు మరోసారి, మరీ ముఖ్యంగా నంద్యాల ఎన్నికల తర్వాత వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అందుకే జగన్ కి మరోసారి చెల్లి గుర్తుకు వచ్చింది. ఆమె ప్రచారం పార్టీ కి అవసరం అని భావించిన జగన్ ఓ బంధువుతో ఎంపీ టికెట్ ఇస్తానని షర్మిలకు కబురు పంపారట. దీంతో పాత అవమానాలు మరిచిపోయి ఆమె జగన్ దగ్గరికి వచ్చేసరికి అసలు విషయం తెలిసి షాక్ అయ్యిందట.
ఎంపీ టికెట్ అనగానే ఆమె కడప గురించి వూహించుకుందట. అయితే జగన్ అక్కడ పోటీకి అవకాశం లేదని మరో రెండు ఆప్షన్స్ చూపారట. అందులో ఒకటి ఒంగోలు, ఇంకోటి వైజాగ్. బాబాయ్ వై.వి .సుబ్బారెడ్డి ఈసారి అద్దంకి అసెంబ్లీ నుంచి పోటీ చేసే ఆలోచనలో వున్నారని ఆయన ఆ పని చేస్తే నువ్వు ఒంగోలు నుంచి పోటీ చేయాల్సి ఉంటుందని, ఒకవేళ అది కాకుంటే అమ్మ పోటీ చేసి ఓడిపోయిన విశాఖ లో పోటీ చేయాలని జగన్ ప్రతిపాదించారట. ఒంగోలు కొంత పర్లేదు అనుకున్నా విశాఖ లో అప్పుడు కన్నా ఇప్పుడు పార్టీ పరిస్థితి దిగజారిందని షర్మిలకు తెలుసట. ఇక ఒంగోలు విషయానికి వస్తే అక్కడ వై.వి సుబ్బారెడ్డి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎంపీ సీట్ ఇస్తానని పిలిచి ఇంకోసారి అయోమయం లో పడేసిన అన్నని చూసి ఆ చెల్లి ఏమి అనుకుంటుందో వేరే చెప్పాలా ?