Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిస్తే వైసీపీ కి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ భావించారు. అందుకే నంద్యాల లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. ఇప్పుడు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుల్లో గెలుపు విశ్వాసం కనిపించడం లేదు. గెలవకపోతే ఏమవుతుందన్న భయమే కనిపిస్తోంది. ఆ భయం వెనుక కారణాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక విషయం మీద చర్చ వచ్చినప్పుడు కొంతమంది సీనియర్స్ పోటీకి దూరంగా ఉందామని ప్రతిపాదించారు. అలా చేస్తే ఎన్నికల ఖర్చు తప్పడంతో పాటు ఓటమి ఎదురైతే వచ్చే కష్టాలు, నష్టాలు తప్పించుకోవచ్చని సూచించారు. అయితే జగన్ ముమ్మాటికీ ఆ మాట వినలేదు. పట్టించుకోలేదు. పోటీ చేయకపోతే పార్టీ పరువు పోతుందని వాదించారు.
ఇప్పుడు ఫలితాలు రాబోయే ముందు పార్టీ సీనియర్స్ చెప్పిన మాటలు జగన్ కి గుర్తు వస్తున్నాయట . ఒకవేళ ఓటమి ఎదురు అయితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో అర్ధం అవుతున్నాయట. అప్పట్లో సీనియర్స్ చెప్పినట్టు వింటే ఈ ఇబ్బందులు తప్పేవి కదా అని జగన్ అంతర్మధనం చెందుతున్నారు. కానీ ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ డైలాగ్ లాగా ఒకే ఒక్క గెలుపు మొత్తం అదృష్టాన్ని మార్చేస్తుందని నమ్ముతున్నారు జగన్.
మరిన్ని వార్తలు: