Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వై.ఎస్ జగన్ ఏ ముహూర్తాన పాదయాత్ర మొదలు పెట్టారో గానీ వైసీపీ దశ,దిశ మెరుగుపడకపోగా ఇంకాస్త దిగజారుతోంది. ఇన్నాళ్లు పార్టీ వదిలిపెట్టి వెళ్లేవాళ్ళు జగన్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేసేవాళ్ళు. ఈసారి గిడ్డి ఈశ్వరి ఏకంగా ఆయన మీద ఎస్సీ,ఎస్టీ కేసు పెడతా అనే దాకా వచ్చారు. ఈ పరిణామాలు వైసీపీ లో కలవరం కలిగిస్తున్నా పరిస్థితి చక్కదిద్దడానికి చొరవ తీసుకుంటున్న వాళ్ళు పెద్దగా కనపడడం లేదు. అందుకే జగన్ కుటుంబ సభ్యులు ఇంకా సూటిగా చెప్పాలంటే ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి పార్టీలో అసంతృప్తుల్ని బుజ్జగించడానికి నేరుగా రంగంలోకి దిగుతున్నారు.
జగన్ పాదయాత్ర మొదలు అయ్యాక పార్టీని ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు విడిచిపెట్టారు. అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి కూడా సైకిల్ ఎక్కేస్తున్నారు. వీరిలో గిడ్డి ఈశ్వరితో భారతి , గుర్నాథరెడ్డి తో విజయమ్మ మాట్లాడినట్టు ఇప్పటికే వైసీపీ ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. అయితే ఈ వ్యవహారంలో అత్తాకోడళ్లు ఇద్దరూ సక్సెస్ కాలేకపోయారు. దీంతో జగన్ దగ్గరున్న చివరి అస్త్రాలు కూడా పనికి రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఎన్నికల నాటికి కేసుల వ్యవహారం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి విజయమ్మ , భారతిని జగన్ ఇప్పుడే సీన్ లోకి తేకుండా ఉంటే బాగుండేదని కొందరు వైసీపీ నేతలే అంటున్నారు. పార్టీని వదిలి వెళ్లే వాళ్ళు ఎటూ ఆగరు, వారి కోసం విజయమ్మ, భారతి మీద ఫెయిల్యూర్ ముద్ర వేయకుండా జగన్ జాగ్రత్త పడాల్సింది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరినీ బుజ్జగింపుల వ్యవహారానికి దూరం పెట్టినా అది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే.