Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేతగా జగన్ తెచ్చిన మార్పు కంటే.. ఆ పార్టీలో ప్రశాంత్ కిషోర్ తెచ్చిన మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ జగన్ ప్రభుత్వంపై పోరాడాలని ఎంత చెప్పినా పట్టించుకోని నేతలు, క్యాడర్.. పీకే టీమ్ దెబ్బకు లైన్లోకి వచ్చారు. ఎక్కడికక్కడ వీలైనంత సమాచార సేకరణ చేస్తున్నారు. దీనికి తోడు వివిధ వర్గాల అభిప్రాయాలను కూడా తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
అసలు రాజకీయ పార్టీ అంటే ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉండాలి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారి అవసరాలేంటో తెలుసుకుని నిరంతర పోరాటాలు చేస్తూ పరిష్కార మార్గాలు అన్వేషించాలి. కానీ వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర్నుంచి జగన్, వైఎస్ భజనలో మునిగింది తప్ప.. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పీకే దెబ్బకు కాస్త ట్రాక్ పైకి ఎక్కింది.
ప్రశాంత్ కిషోర్ కారణంగా వచ్చే ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా.. ఆయన చేసిన అలవాటు మాత్రం పార్టీకి ఉపయోగపడుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. మొన్నటి ప్లీనరీలో కూడా జగన్ కంటే పీకేను చూసే క్యాడర్ ఎక్కువ ఆనందపడ్డారు. ఈ లెక్కన ఒకవేళ సానుకూల ఫలితం ఇస్తే జగన్ కంటే ఎక్కువ క్రెడిట్ పీకే తీసుకునే ఛాన్స్ ఉంది.
మరిన్ని వార్తలు