Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీలోనే పార్టీని బలోపేతం చేయలేక ఆపసోపాలు పడుతున్న జగన్. తెలంగాణ టూర్ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీలో చంద్రబాబు ధాటికి తట్టుకోలేకపోతున్న జగన్. ఇక్కడ కేసీఆర్ తో ఛాలెంజ్ ఎందుకని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణకు దూరంగా ఉన్న జగన్. ఇప్పుడు ఉన్నట్లుండి ప్లీనరీకి హాజరుకావాలని నిర్ణయించుకుని రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు.
అసలు తెలంగాణలో వైసీపీకి లీడర్లే కాదు క్యాడర్ కూడా లేదు. ఏదో జగన్ వచ్చినప్పుడు కాస్తో కూస్తో హడావిడి చేయడానికి కూడా ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు. అలాంటిది జగన్ సభకు జన సమీకరణ కూడా అంత వీజీగా కనిపించడం లేదు. అలాంటి సభకు వచ్చి జగన్ ఏం సాధిస్తారని ఏపీ వైసీపీ కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు.
కానీ జగన్ మాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో ప్లీనరీకి రావాలని భావిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి చంద్రబాబుతో పోటీపడే జగన్.. ఈసారి కూడా అదే విధంగా ఆలోచిస్తే. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లేననే వాదన ఉంది. వైసీపీ ముందు ఏపీలో బలం పుంజుకున్నాక. తెలంగాణపై దృష్టి పెడితే బాగుంటుందనేది ఆ పార్టీ సీనియర్ల అభిప్రాయం కూడా.