Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ పాదయత్రకి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పాదయాత్ర టైం లో కోర్టు హాజరు నుంచి మినహాయింపు కి అనుమతి రాకున్నా వస్తుందన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. అందుకే జగన్ పాదయాత్ర కోసం పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. అసలు ఈ పాదయాత్ర ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది అన్న దానిపై ఓ విషయం వైసీపీ శ్రేణులకు క్లారిటీ వచ్చిందట. వై.ఎస్ కి ఎంతో ప్రీతిపాత్రమైన ఇడుపులపాయ నుంచి మొదలయ్యే పాదయాత్ర ఇచ్చాపురం దాకా సాగుతుంది. ఈ దారిలో జగన్ సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఒక్కటి మాత్రమే కాదు…ఆ పాదయాత్రలో రెండు రకాల నియోజకవర్గాల మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారట. అవి ఏమిటంటే …
నంద్యాల,కాకినాడ ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్ అండ్ కో ఆపరేషన్ 2019 ఎలక్షన్స్ మొదలు పెట్టిందట. అందులో భాగంగా ఇప్పుడు టీడీపీ, ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోటాల్లాంటి నియోజకవర్గాల మీద స్పెషల్ కాన్సంట్రేషన్ చేయబోతున్నారట. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ 6 అంత కన్నా ఎక్కువ సార్లు గెలిచిన నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యల్ని ప్రస్తావిస్తూ సాధ్యమైనంత ఎక్కువ మందిని జగన్ కలిసేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారట. ఇక రెండో ప్రధాన అంశం…ఒకప్పుడు కాంగెస్స్ కి కంచుకోటలుగా వున్న నియోజకవర్గాలు, వై .ఎస్ కి ముఖ్య అనుచరులుగా మెలిగిన నేతలు టార్గెట్ గా కూడా జగన్ పాదయాత్ర సాగుతుందట. వై.ఎస్ అనుచరులు ఏ పార్టీ లో వున్నా వారిని కలిసి పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ అనుకుంటున్నారట.