Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అవిశ్వాస తీర్మానానికి సై అంటూ మొన్న ప్రకాశం జిల్లా యాత్రలో ప్రకటించిన జగన్ సవాల్‌కి కౌంటర్‌గా పవన్ ప్రతి సవాల్ విసురుతూ బంతిని జగన్ కోర్ట్‌లోకి పంపడంతో వైసిపి ఇప్పుడు కొత్త డ్రామాకి తేరా లేపింది. అసలు పవన్ కు జగన్ ఎలాంటి సవాల్ విసరలేదని… పవన్ సలహాను స్వీకరిస్తున్నామని మాత్రమే చెప్పారని అంటూ కొత్త డ్రామాకి తెరలేపారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు . కేంద్రంపై అవిశ్వాస తీర్మానికి వైసీపీ ఎల్లప్పుడూ సిద్ధమేనని, పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నారు.
అంత బానే ఉంది ఇందులో డ్రామా ఏముంది అంటరా? ఇక్కడే ఉంది అసలు డ్రామా పవన్ మార్చి 4న అవిశ్వాసం నోటిసు ఇస్తే 5 వ తారిఖు సభలో నో కాన్ఫిడేన్స్ మోషన్ ప్రస్తావనకి వస్తుందని.. అప్పుడు 50 మంది ఎంపీల మద్దతును కూడగట్టి బడ్జెట్ ఆమోదానికి ముందే అవిశ్వాస తీర్మానం చర్చకి వస్తుంది. అప్పుడు చర్చ మొదలైతే అటో ఇటో తేలిపోతుంది అని చెప్పాడు. కానీ జగన్ పార్టీ మాత్రం అవిశ్వాసం నోటిసు మార్చ్ 21న ఇస్తాను అంటూ భీరాలు పలుకుతుంది. ఎందుకంటె సభ ప్రారంభంలోనే తీర్మానం చర్చకి వస్తే అప్పుడు ప్రతిపక్షాలకి ఇతర పార్టీలకి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి ప్రభుత్వ విదానాలను ఎండగట్టే అవకాశం వస్తుంది. అదే జరిగితే జగన్.. మోడీ ఆవేశానికి పాత్రుడు కావాల్సి వస్తుంది. పెట్టుకోవాలనుకున్న పొత్తుకి కూడా ఎసరు వస్తుంది. అదే మార్చ్ 21న అవిశ్వాస తీర్మానం వస్తే అప్పటికి బడ్జెట్ ఆమోదం పొంది ఉంటుంది. సభ చివరి రోజుల్లో అవిశ్వాసం వస్తే ఏదో టెక్నికల్ కారణం చూపించి స్పీకర్ దాన్ని తిరస్కరిస్తే అ పాపాన్ని బాబు మీదనో, పవన్ మీదనో నెట్టేసి తాము సేఫ్ అవ్వాలి అని చూస్తుంది. అందుకే మార్చ్ 21 అంటూ కొత్త రాగాన్ని అందుకుంది… సరికొత్త డ్రామాకు తేరా లేపింది