అందర్ని అవాక్కయ్యేలా చేసిన అఖిల్‌

Akhil Akkineni Superb Song Performance at SIIMA Award function,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Akhil Akkineni Superb Song Performance At SIIMA Award Function

అక్కినేని వారి ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా ‘అఖల్‌’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తీవ్రంగా నిరాశ పర్చాడు. ఆ సినిమా ప్రేక్షకులకు మరియు ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా ఆయన కూడా తీవ్రంగా నిరుత్సాహ పడ్డాడు. ఆ సినిమా కోసం అఖిల్‌ చాలా కష్టపడ్డాడు. ఆ చిత్రం ఫ్లాప్‌ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ఇప్పటికి విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ అక్కినేని ప్రిన్స్‌ దుబాయిలో జరుగుతున్న సైమా అవార్డు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ అవార్డు వేడుకల్లో అఖిల్‌ అందరిని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేశాడు. స్టేజ్‌పై ఒక పాట పాడిన అఖిల్‌ ఈ ట్యాలెంట్‌ కూడా ఉందా అనిపించుకున్నాడు. 

గత సైమా వేడుకల్లో డాన్స్‌తో ఆకట్టుకున్న అఖిల్‌ ఈసారి ఒక పాట పాడటం జరిగింది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలోని ఒక పాటను సైమా వేదికగా పాడి మెప్పించాడు. ఒక ప్రొఫెషనల్‌ సింగర్‌ తరహాలోనే అఖిల్‌ ఆ పాట పాడి అదరహో అనిపించుకున్నాడు. ఒక స్టార్‌ హీరో స్టేజ్‌పై ఇలా పాట పాడటం చాలా అరుదు. అది కూడా దుబాయిలో జరుగుతున్న సైమా వేడుకల్లో అఖిల్‌ పాడటంతో ఇప్పుడు ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ముందు ముందు అఖిల్‌ తన సినిమాల్లో పాటలు పాడుకుంటాడేమో చూడాలి. థమన్‌ ఎప్పుడైనా అఖిల్‌ సినిమాకు సంగీతాన్ని అందిస్తే అఖిల్‌తో పాట పాడివ్వడం ఖాయం.

మరిన్ని వార్తలు