ఇంట్లోనైనా కూర్చుంటా కాని వాటికి ఒప్పుకోను

They-Sit-At-Home-But-Will-N

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

I Am Not Inrested Glamorous Roles

టాలీవుడ్‌తో పాటు ఏ భాషలోనైనా హీరోయిన్‌గా రాణించాలి అంటే ఖచ్చితంగా ఎక్స్‌ ఫోజింగ్‌ చేయాల్సిందే. అందాల ప్రదర్శణకు నో చెప్పిన పలువురు హీరోయిన్స్‌ జాడా పత్తా లేకుండా పోయారు. అయినా కూడా కొందరు హీరోయిన్స్‌ మాత్రం తాము అందాల ప్రదర్శణకు వ్యతిరేకంగా అంటున్నారు. కొందరు ముందు ఇలా అని ఆ తర్వాత అవకాశాల కోసం ఒక మోస్తరుగా అందాల ప్రదర్శణకు ఓకే అంటారు. అయితే మంజిమా మోహన్‌ మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో గ్లామర్‌ రోల్స్‌ చేయను అంటోంది. 

తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మంజిమ మోహన్‌కు తెలుగులో మంచి ఆఫర్లే వచ్చాయి. అయితే గ్లామర్‌ పాత్రలను తాను చేయను అని, అందాల ప్రదర్శణకు తాను దూరం అని చెప్పడంతో వచ్చిన ఆఫర్లు వెనక్కు వెళ్లి పోయాయి. తమిళంలో ప్రస్తుతం ఈ అమ్మడు రెండు మూడు సినిమాలు చేస్తుంది. ఆ సినిమాలు గ్లామర్‌గా కనిపించకుండానే నటిస్తుందట. సినిమాల్లో నటించకుండా ఇంట్లో అయినా కూర్చుంటాను కాని తాను మాత్రం గ్లామర్‌ రోల్స్‌ చేయను, లిప్‌ కిస్‌లకు, స్కిన్‌ షోకు ఓకే చెప్పను అంటూ తేల్చి చెప్పింది. ఈమె ఎంత కాలం ఇలా ముడుచుకుని ఉంటుందో చూడాలి. ఈమె ఇలాగే ఉంటే త్వరలోనే ఈమె ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

మరిన్ని వార్తలు

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ .

ఎన్టీఆర్ పాట పాడుతున్న మెగా హీరో.

డీజే లో స్వీట్ షాక్… స్విమ్ సూట్ తో మెరిసిన పూజ.

ఇంట్లోనైనా కూర్చుంటా కాని వాటికి ఒప్పుకోను - Telugu Bullet