అమెరికాలో రజనీ బిజీనా..?

Rajinikanth Went To USA For Health Check Up

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Rajinikanth Went To USA For Health Check Up

రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. దేవుడు ఆదేశించగానే వస్తానని చెప్పిన రజనీ.. ఇదమిద్ధంగా తేల్చకుండా అభిమానుల్ని, తంబీల్ని ఊరిస్తున్నారు. కానీ తెరవెనుక మాత్రం చురుగ్గా మంత్రాంగం జరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో వివిధ వర్గాలతో భేటీ అయిన రజనీ.. అభిమానులతో ఏకంగా నాలుగు రోజుల పాటు ముఖాముఖి చర్చలు జరిపారు. వీటి సారాంశంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అంతా భావిస్తున్నారు.

కానీ రజనీ రాజకీయాలకు పనికిరాడని, ఆయన తమిళుడే కాదని చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఎంట్రీ ఇచ్చాక ఇవి మరింత ఎక్కువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రజనీకాంత్ ఆచితూచి అడుగేస్తున్నారు. ప్రస్తుతం హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన తలైవా.. చెన్నై వచ్చాక మరోసారి అభిమానుల్ని కలవబోతున్నారు. ఈసారి మాత్రం కీలక ప్రకటన ఉంటుందని కూడా వారికి ముందస్తు సమాచారం వెళ్లిందట.

అరవై ఐదేళ్ల వయసులో రజనీ ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారంటే విమర్శకులు ప్రధానంగా రెండు విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఒకటి సినిమాలు సరిగ్గా ఆఢకపోవడం, రెండు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన. దీనికి తోడు చెన్నైలో పొలిటికల్ పిక్చర్ అనుకూలంగా ఉందని రజనీ సన్నిహితులు కూడా భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా వచ్చేస్తే ఓ పనైపోతుందనే భావన రజనీ సన్నిహితులు అందరిలో ఉంది.

మరిన్ని వార్తలు:

నంద్యాల నేతలూ ఖబడ్దార్..!