శమంతకమణి… తెలుగు బులెట్ రివ్యూ.

samanthakamani Telugu Movie review and Rating

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బ్యానర్ : భవ్య క్రియేషన్స్
నటీనటులు : ఆది, నారా రోహిత్ ,సుదీర్ బాబు , సందీప్ కిషన్ తదితరులు
నిర్మాత : వి.ఆనంద్
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
స్క్రీన్ ప్లే : వెంకి
మ్యూజిక్ డైరెక్టర్ : మణి శర్మ
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

తెలుగులో మల్టి స్టారర్ మూవీకి అద్దం పడుతూ నలుగురు హీరోలు కలిసి చేసిన చిత్రం శమంతకమణి. భవ్య క్రియేషన్స్ లాంటి సంస్థ నిర్మాణ సారధ్యం వహించడంతో పాటు తొలి సినిమా భలే మంచి రోజుతో తనదైన మార్క్ చూపించిన యువదర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తోడు కావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. శమంతకమణి లో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షుకులే కాదు అటు ఇండస్ట్రీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఆ అంచనాల్ని శమంతకమణి అందుకుందో,లేదో చూద్దాం.

కథ…

కథగా చూసుకుంటే శమంతకమణి లో వున్నది ఓ చిన్న లైన్ మాత్రమే. నలుగురు హీరోలు, ఓ కారు దొంగతనం చుట్టూ తిరిగే కథ ఇది. కారుని దొంగిలించిన వారిని కనిపెట్టేందుకు చేసిన ఇన్వెస్టిగేషన్ లో వచ్చే మలుపులు. కధగా చెప్పుకోవాలంటే ఇంతే. కానీ కధనాన్ని నమ్ముకుని చేసిన సినిమా ఇది. హైటెక్స్ లో 5 కోట్ల విలువైన కారు దొంగతనానికి గురి అవుతుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఇన్స్పెక్టర్ రంజిత్ ( నారా రోహిత్ ) రంగంలోకి దిగుతాడు. అది, సందీప్ కిషన్, సుధీర్ బాబు, రాజేంద్ర ప్రసాద్ మీద అనుమానం వస్తుంది. ఆ మిస్టరీ ని ఛేదించే క్రమంలో చిత్రవిచిత్రమైన మలుపులు ఉంటాయి. చివరి ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకీ 5 కోట్ల విలువైన కారుని దొంగిలించింది ఎవరో తెలుసుకోవాలంటే శమంతకమణి చూడాల్సిందే.

విశ్లేషణ…

శమంతకమణి టైటిల్, నలుగురు హీరోలు, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, భవ్య క్రియేషన్స్…ఈ మొత్తం కలిపి ప్రేక్షకుల్లో ఓ ఇంటరెస్ట్ క్రియేట్ చేశాయి. అయితే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా సాగే కథ లో ఊహించని మలుపులు దర్శకుడి పనితనాన్ని బయటపెట్టాయి. ఇక నలుగురు హీరోలతో పాటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమ పాత్రల్లో అద్భుతంగా చేశారు. ఏ సీన్ కి ఆ సీన్ బాగున్నా ఓ మాలగా కట్టాక చూస్తే మాత్రం ఎక్కడో ఏదో లోపం అనిపించింది. ఆ తెలియని వెలితి బహుశా కధనాన్ని నడిపిన తీరు కావొచ్చు.

ప్లస్ పాయింట్స్ …

నలుగురు హీరోలు
రాజేంద్రప్రసాద్ నటన
ఫోటోగ్రఫీ  
మ్యూజిక్ .

మైనస్ పాయింట్స్…

కొత్తదనం లేదు

తెలుగుబుల్లెట్ పంచ్ లైన్…“శమంతకమణి ” ప్రకాశం తక్కువ .

తెలుగు బులెట్ రేటింగ్ … 2 . 75 /5 .