Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నూతన రాష్ట్రపతి రామ్ నాధ్ కోవిద్ బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఓ వైపు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ ఇద్దరు సీనియర్ నాయకులకి ఏ ప్రాధాన్యం లేకుండా షాకుల మీద షాకులు ఇస్తుంటే కోవిద్ ఇంకో రీతిలో ఆ ఇద్దర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఓ విధంగా చెప్పాలంటే అడ్వాణీకి రాష్ట్రపతి పీఠం దక్కకుండా చూసేందుకే కోవిద్ ని మోడీ, షా ద్వయం తెర మీదకి తెచ్చింది. అయినా కోవిద్ మాత్రం ఎవరిని ఏ రీతిలో గౌరవించాలో చేసి చూపించారు. ఓ సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్రపతిగా కోవిద్ ఎలా ఎదిగాడో చెప్పేందుకు ఈ ఒక్క సన్నివేశం చాలు.
రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన కోవిద్ ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ అగ్రనేతల్ని దగ్గరికి వచ్చి మరీ పలకరించారు. ఈ వరసలో మోడీ,షా, అద్వానీ, మురళి మనోహర్ జోషి లాంటి దిగ్గజాలు వున్నారు. ప్రధాని మోడీ , బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కి మామూలుగానే నమస్కరించిన కోవిద్ అద్వానీ, జోషి దగ్గరికి వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్ మార్చేశారు. బీజేపీ ని ఈ స్థాయికి తీసుకురావడంలో తమ జీవితాల్ని అంకితం చేసిన అద్వానీ , జోషి లకు శిరస్సు వంచి మరీ నమస్కారం చేశారు. మోడీ, షా ల వేషాలు చూసిచూసి విసిగిపోయిన ఆ సీనియర్ నేతలు కోవిద్ మర్యాద చూసి కచ్చితంగా షాక్ తిని వుంటారు.
మరిన్ని వార్తలు