సంపూ వెళ్లడం ధన్‌రాజ్‌కు కలిసి వచ్చే అంశం

Dhanraj Is A Good Craze After Leaving Sampoo Babu In Big Boss Show.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బిగ్‌బాస్‌ షో నుండి సంపూర్నేష్‌బాబు అర్థాంతరంగా బయటకు వెళ్లి పోయాడు. నాలుగు గోడల మద్య తాను ఉండలేక పోతున్నాను అంటూ ఎలాంటి లీగల్‌ చర్యలకు అయినా కూడా సిద్దమే అంటూ హౌస్‌ నుండి సంపూ బయట పడ్డాడు. నిన్నటి వరకు బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న 13 మందిలో అత్యధిక క్రేజ్‌ కలిగిన సెలబ్రెటీ సంపూర్నేష్‌బాబు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు సంపూ ఇంటి నుండి వెళ్లడంతో ఇప్పుడు ఆ ఇంటిలో అత్యధిక క్రేజ్‌ ఉన్న సెలబ్రెటీగా జబర్దస్త్‌ ధన్‌రాజ్‌ నిలిచాడు. సీజన్‌ ప్రారంభం సమయంలో సంపూ మరియు ధన్‌రాజ్‌ల మద్య తీవ్ర పోటీ ఉండటం ఖాయం అని అంతా భావించారు. కాని సంపూ వెళ్లిన నేపథ్యంలో ధన్‌రాజ్‌కు పోటీ లేకుండా అయ్యింది.

ధన్‌రాజ్‌ ప్రస్తుతం ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇంటి సభ్యులు గొడవ పడుతుంటే ఇద్దరికి సర్ది చెప్పడంతో పాటు, ఎవరి వైపు నిలవకుండా గొడవ సర్దుమనిగేలా చేయడం ధన్‌ రాజ్‌ చేస్తున్నాడు. అలాగే వంటల విషయంలో కూడా ధన్‌రాజ్‌ను అంతా మెచ్చుకుంటున్నారు. అందుకే ధన్‌ రాజ్‌ ఫైనల్‌ వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రేక్షకుల ఆధరణ కూడా ధన్‌రాజ్‌కు కలిసి వచ్చే అంశం. ఇక ధన్‌ రాజ్‌ తర్వాత స్థానంలో శివబాలాజీ నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. శివబాలాజీ తన పనేదో తాను చూసుకుంటూ, ఇతరులను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇంటి పనుల్లో కూడా అందరికి సాయం చేస్తూ తన వంతు కృషి చేస్తున్నాడు. దాంతో శివబాలజీ ఫైనల్‌ వరకు చేరుకుంటాడని అంతా భావిస్తున్నారు. ఇంకా రెండు నెలల పాటు ఈ బిగ్‌బాస్‌ షో కొనసాగుతుంది. చివరికి ఎవరు మిగులుతారో చూడాలి.

మరిన్ని వార్తలు:

మనోళ్లు మహా ముదుర్లు.. డ్రగ్స్‌ కేసులో పట్టుబడకుండా..!

వై.వి.ఎస్ చౌదరి గొంతు లేచింది.

‘గౌతమ్‌నంద’కు ఆమె అందాలు ప్లస్‌