రెండవ జాబిత వద్దు.. ప్రభుత్వంకు నిర్మాత రహస్య విజ్ఞప్తి

Top Producer Talks With Telangana CM KCR About Drugs Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్‌ డీలర్‌ కెల్విన్‌ పట్టుబడిన తర్వాత పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. మొదటి దఫాలో 12 మంది సెలబ్రెటీలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా సమాచారం ఉంది. మొదట నోటీసులు అందుకున్న వారు విచారణలో పలువురి పేర్లు చెబుతున్నారు. దాంతో వారందరికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్‌ అధికారులు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం రెండవ జాబితాను సిద్దం చేసే పనిలో ఉన్నారు. రెండవ జాబితాలో దాదాపు 25 నుండి 30 మందికి నోటీసులు అందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 

ఆ 30 మందిలో ప్రముఖుల పిల్లలు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్‌ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో మంతనాలు ప్రారంభించింది. ఇకపై డ్రగ్స్‌ విషయంలో టాలీవుడ్‌ ప్రముఖులు అంతా జాగ్రత్తగా ఉంటారు, దయచేసి రెండవ జాబిత విడుదల చేయవద్దని, ప్రస్తుతం జరుగుతున్న విచారణ పూర్తి చేసి దాన్ని కూడా మెల్లగా సైడ్‌ ట్రాక్‌ పట్టించాల్సిందిగా ఒక ప్రముఖ నిర్మాత స్వయంగా సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనకు కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా కేసీఆర్‌ను కలుసుకోగలిగాడు. కేసీఆర్‌ ఆయన విజ్ఞప్తి పట్ల సానుకూలత వ్యక్తం చేశాడని, మళ్లీ ఇలాంటి వ్యవహారాలు జరగకుండా చూసుకోవాలని, మరోసారి డ్రగ్స్‌ వాడుతున్నట్లుగా సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తే అంతా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించినట్లుగా తెలుస్తోంది. దాంతో ఇక రెండవ జాబితా రానట్లే అని సినీ ప్రముఖులు అంటున్నారు. ప్రభుత్వం ఆబ్కారీ శాఖకు ఆ విషయాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

‘గౌతమ్‌నంద’కు ఆమె అందాలు ప్లస్‌

ఛార్మి ముందు ఉంచే ప్రశ్నలు ఇవే