భారత్ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ సదస్సును భారత్ విజయవంతంగా.. ఎంతో అద్భుతంగా నిర్వహించిందని ప్రపంచ నేతలు ప్రశంసించారు. జీ-20 సదస్సు ముగియగా.. తదుపరి సారథ్య బాధ్యతలను ప్రధాని మోదీ బ్రెజిల్‌కు అప్పగించారు. డిసెంబరు 1వ తేదీన బ్రెజిల్ లాంఛనంగా చేపట్టనుండడంతో దానికి చిహ్నంగా.. చెక్కతో రూపొందించిన అధికార దండాన్ని (చిన్న సుత్తి ఆకారంలోని గవెల్‌ను) ఆ దేశాధ్యక్షుడు లూయీ ఇనాసియో లులా డసిల్వాకు ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు.
దిల్లీ సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షకు నవంబరు నెలాఖరులో వర్చువల్ విధానంలో భేటీ అవుదామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. బ్రెజిల్‌కు అందించే సారథ్యం ద్వారా కూటమి తన లక్ష్యాల సాధనలో పూర్తిస్థాయిలో సహకరిసస్తూ, మున్ముందుకు దూసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ‘
ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని ప్రార్థిస్తూ, ఆకాంక్షిస్తూ సంస్కృత శ్లోకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పఠించారు .బ్రెజిల్ తరఫున అధ్యక్షుడు లులా ఆయా బాధ్యతలకు గుర్తుగా తమ తమ దేశాలకు చెందిన ఒక్కో మొక్కను మోదీకి అందజేశారు. పర్యావరణ ప్రాధాన్యాన్ని చాటేలా వాటిని భారత్ మండపం ప్రాంగణంలోనే నాటారు.