టమాట.. నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే సామాన్యులు బెంబేలెత్తిపోయేవారు. ఎందుకంటే ధరలు ఆ రేంజ్లో ఉండేవి. ఏకంగా రూ.300 వరకు చేరింది కిలో టమాట ధర. ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు కిలో టమాట ధర రూ.10 వరకు గరిష్ఠంగా ఉంది. ఇక కొన్ని ప్రాంతాలలో కిలో నాలుగు రూపాయలకే టమోటాలు విక్రయిస్తున్నారు. కర్నూలు జిల్లా లో కిలో టమోటా 4 రూపాయలు పలుకుతోంది.
టమోటా ధరలు కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయం మార్కెట్లో దారుణంగా పడిపోయాయి. దీంతో కూలీ, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాదంటున్నారు టమాటో రైతులు. ఇక మార్కెట్ కు తెచ్చిన టమోటాలను అమ్మలేక, తిరిగి తీసుకెళ్లలేక కింద పడవేసి వెళ్తున్నారు రైతులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.