ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరో భారీ కుంభకోణం బయటపడింది. అక్రమార్కులు భక్తుల సొమ్మును కాజేశారు. శ్రీఘ్రదర్వనాలు, అభిషేకం టికెట్లు, కంకణాలు, మహా మంగళ హారతి టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చాలా వరకు స్వాహా చేసేశారు. అది ఎలా అంటే.. 150 రూపాయల శీఘ్ర దర్శనంలో కోటి రూపాయలను, 15 వందల అభిషేకం టికెట్లలో 50 లక్షలను, అకామడేషన్‌లో మరో 50 లక్షలను కాజేసిన వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
అయితే దీనికి సంబంధించి అక్రమార్కులు ఏకంగా సాఫ్ట్‌వేర్‌నే మార్చేశారని తెలుస్తోంది. ఒక్కో అవినీతి బండారం బయట పడుతుంటంతో ఈవోకి ఉద్యోగులు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. టోల్ గేట్ పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగిందని సరికొత్త రూపంలో చాడీలు ఆరోపణలు గుప్పించికుంటున్నారు.