ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సోనియా గాంధీ లేఖ రాశారు. ఇతర రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారని.. స్పెషల్ సెషన్స్ ఎజెండా గురించి ఎవ్వరికీ తెలియదంటూ లేఖలో ప్రశ్నించారు. మొత్తం ఐదు రోజులు ప్రభుత్వ బిజినెస్ కోసం కేటాయించబడ్డాయని మాకు సమాచారం ఇచ్చారు.. మేము ఖచ్చితంగా ప్రత్యేక సెషన్‌లో పాల్గొంటామన్నారు.
ప్రజల ఆందోళన మరియు ప్రాముఖ్యత గల విషయాలను లేవనెత్తడమే మా లక్ష్యమని.. ప్రజా సమస్యలపై చర్చ కోసం తగిన సమయం కేటాయిస్తారని నముతున్నానని సోనియా గాంధీ పేర్కొన్నారు. పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ లో ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం పై చర్చించాలని…రైతు సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధర అంశంపై చర్చించాలని లేఖలో వివరించారు. అదానీ గ్రూపు వ్యాపారాలు, లావాదేవీలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని సోనియా గాంధీ కోరారు