Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించటంతో ఇప్పుడు మేయర్ఎ వరనేదాని పై అందరి దృష్టి నెలకొంది. బీజేపీతోకలిసి పోటీ చేసినప్పటికీ మేయర్‌పీఠాన్ని కై వసం చేసుకోవటానికి అవసరమైన మెజార్టీని టీడీపీ సొంతంగానే సాధించింది. 48 డివిజన్లలో సగానికి పైగా 32 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది.దీంతోఇప్పుడు చంద్రబాబు మేయర్ పీఠం పై ఎవరిని కూర్చో బెడటారనేది ఆసక్తిగా మారింది. మేయర్ పీఠం కాపు వర్గానికి కేటాయిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఆహామీ ప్రకారం కాపులకే కేటాయిస్తారా లేదా అని చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం శేషకుమారి, అడ్డూరిలక్ష్మి, సుంకరపావని, సుంకరశివప్రసన్నపేర్లు మేయర్బరిలో వినిపిస్తున్నాయి. దీని పై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. 30 ఏళ్ల తరువాత కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవటంతో మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్నఆశావహుల సంఖ్య టీడీపీలో ఎక్కువగా ఉంది. స్థానికపరిస్థితులు, ఆశావహుల నేపథ్యం పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు మేయర్‌ను ఎంపిక చేయనున్నారు.
మరిన్ని వార్తలు: