తెలంగాణ హైదరాబాదో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తాను ఎమ్మెల్సీ కొడుకుని అని చెప్పి ఓ పెళ్లైన స్త్రీతో పరిచయం పెంచుకున్న యువకుడు కొద్దిరోజుల తర్వాత తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఆమెతో సన్నిహితంగా దిగిన ఫోటోలను అడ్డం పెట్టుకుని అడిగినంత డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ లకు పాల్పడ్డాడు. అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన వివాహితకు కొద్దిరోజుల క్రితం భరత్‌కుమార్ అలియాస్ చింటు అనే యువకుడు పరిచయం అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అతను తాను ఓ బడా ఎమ్మెల్సీ కుమారుడిని అంటూ ఆమె ముందుకు పోజులు పోయాడు. అలా ఆమెకు మాయమాటలు చెప్పి రంగంలోకి దింపాడు. తరుచూ ఆమె ఇంటికి వెళ్లి ముచ్చట్లు చెప్పేవాడు. దీంతో వారిద్దరు సన్నిహితంగా ఫోటోలు తీసుకోవడం వరకు జరిగింది.