నయనతార మరో రెండు రోజుల్లో డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోనుంది. దీనిపై నయనతార – విఘ్నేష్ శివన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ.. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ సెలబ్రిటీ జంట జూన్ 9న మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారు.
ఈ వేడుకకి సీఎం స్టాలిన్, రజినీకాంత్ , కమల్ హాసన్,అజిత్ వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరు కానున్నారట…నానుమ్ రౌడీ తాన్ సినిమా నుంచి విఘ్నేష్ శివన్‌తో నయన తార ప్రేమలో ఉంది. అంతకు ముందు ఆమెకు శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం బలంగానే నడిచింది.
అయితే ఏమైందో తెలియదు కానీ.. వారిద్దరికీ బ్రేకప్ చెప్పేసిన నయన్.. కొన్ని నెలలు పాటు సైలెంట్‌గా ఉండింది. తర్వాత విఘ్నేష్ శివన్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రేమ పెళ్లిగా మారనుంది.