సంసారానికి పనికిరాని అతను ఫస్ట్ నైట్ రోజు ఏమి చేసాడంటే…!

Nude Photos Of Nedumudi Thackeray
కాబోయే వాడి మీద ఎన్నో ఆశలతో అత్తారింటికి వచ్చిన ఓ అమ్మాయికి తొలిరాత్రే పిడుగులాంటి వార్త తెలిసింది. తాను సంసారానికి పనికిరానని చెప్పిన భర్త, ఫస్ట్ నైట్ రోజే భార్య నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలుపెట్టాడు. తాను నపుంసకుడనని, ఆ విషయం బయటకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వైరల్ చేసి పరువు తీస్తానని ఆమెను వేధించాడు. కొన్నాళ్లు మౌనంగా భరించిన విషయం అత్త చెవిలో వేసింది. అయితే కొడుకు చేసిన పనికి కోడలిని దగ్గరకు తీసుకోవాల్సిన ఆమె సిగ్గు లేకుండా కొడుకు విషయం తెలిసిన కోడలినే వదిలించుకోవాలనుకుంది.
first-night-lady
పోలీసులు అందించిన పూర్తి వివరాల ప్రకారం అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేంద్రప్రసాద్ కు గత సంవత్సరం ఆగస్టులో వివాహమైంది. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు రూ. 55 లక్షల కట్నాన్ని కూడా ఇచ్చహ్రు.అయితే, రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికిరాడన్న విషయాన్ని దాచిపెట్టిన ఆయన తల్లిదండ్రులు, ఈ పెళ్లి చేసి తమ చేతులు దులుపుకున్నారు. ఆపై విషయం తెలుసుకున్న యువతి, బయటకు చెప్పుకోలేక లోలోపలే మధనపడింది. అత్తమామలకు విషయాన్ని చెబితే, వారు కూడా ఆమెను బెదిరించారు. తమ కోడలికి టీబీ ఉందని ప్రచారం చేశారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. ఏడాదిపాటు ఈ దారుణాన్ని భరించిన ఆమె, ఇక లాభం లేదని పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.