సీఎం KCR, మంత్రి KTR చిత్రపటాలకు పాలాభిషేకం.. జీవో నెంబర్ 46 సవరణ చేయాలని నిరసన ..

TG Politics: KTR suffering from high fever...KCR away from the assembly
TG Politics: KTR suffering from high fever...KCR away from the assembly

ఉస్మా నియాయూనివర్సిటీలో గ్రామీణ కానిస్టేబుల్ అభ్య ర్థులు నిరసన వ్య క్తం చేశారు. జీవో నెం బర్ 46 సవరణ చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్, మం త్రి కేటీఆర్ కి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. గత 70 రోజుల నుండి జీవో నెంబర్ 46 పై పోరాటం చేసామని తెలిపారు. ఇప్పు డైనా కరుణించి జీవో నెంబర్ 46 రద్దు చేయాలని గ్రామీణ కానిస్టేబుల్ అభ్యర్థులు కేసీఆర్ ను కోరారు. గ్రామీణ కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టడంతో ఉస్మానియాయూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022-23లో జీవో 46 కారణంగా గ్రామీణ ప్రాంతాల యువతకు, గ్రామీణ జిల్లాల నిరుద్యోగ పోలీసు అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. జియో నంబర్ 46 కారణంగా, పరీక్షలలో అర్హత సాధించిన గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో నియమితులైన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53%, మిగతా 26 జిల్లాలకు 47% రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఇతర జిల్లాల గ్రామీణ అభ్యర్థులకు ఉద్యోగాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 130 మార్కులకు మించి వస్తే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి ఉందని, హైదరాబాద్ మినహా తెలం గాణలోని ఇతర రూరల్ జిల్లాల్లో జీవిస్తున్నా రని చెబుతున్నా రు. అదే హైదరాబాద్ జిల్లాలో 80 (+) మార్కు లు వచ్చిన వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో TSSPలో 53% కోటా ప్రకారం 2000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయని, పోస్టుల కేటాయింపులో గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తాజా రిక్రూట్‌మెంట్లలో జీఓ 46 నుంచి టీఎస్‌ఎస్పీ కానిస్టేబుళ్ల పోస్టులను మినహాయిస్తే 2016, 2018లో జరిగిన రిక్రూట్‌మెంట్ల తరహాలోనే రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా రు.