చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ భారతదేశం మొత్తాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసి సక్సెస్ ఫుల్ గా గగనతలంలో తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది. ఈ చంద్రయాన్ 3 గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను ఇస్రో శాస్త్రవేత్తలు అందిస్తున్నారు.ఇస్రో చంద్రయాన్-3 గురించి ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తోంది.
అయితే.. ప్రజ్ఞాన రోవర్ చంద్రుడిపై 100 మీటర్ల దూరం ప్రయాణించి….స్లీప్ మోడ్ లోకి వెళ్లేముందు తనకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసింది. కాగా, జాబిల్లిపై 14 రోజుల పగలు పూర్తి కావస్తోంది. ఇప్పటికే శివశక్తి పాయింట్ వద్ద సాయంకాలం మొదలై చీకటి అలుముకుంటుంది. అక్కడ రాత్రిళ్ళు ఉష్ణోగ్రతలు -200°c వరకు పడిపోతాయి. ఇంత శీతల వాతావరణాన్ని రోవర్ లోని పరికరాలు తట్టుకోలేకపోవచ్చు. దీంతో రోవర్ ను స్లీప్ మోడ్ లో ఉంచుతున్నారు.