ఆ సెంటిమెంట్ తో రాష్ట్రపతికి గుడారం వేసిన బాబు.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాగార్జున యూనివర్సిటీలోకి అడుగు పెడితే సీఎం పీఠం కదిలిపోతుందని ఎప్పటినుంచో ఓ టాక్. అది నిజమో కాదో తెలియదు గానీ రాజకీయ నేతలకు పెద్ద సెంటి మెంట్ అయ్యి కూర్చుంది. ఆ సెంటి మెంట్ బ్రేక్ చేసేంత ధైర్యం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. సీఎం చంద్రబాబు కూడా అదే రూట్ లో వెళుతున్నారు. 2014 లో టీడీపీ అధికారానికి వచ్చాక యూనివర్సిటీ ఎదురుగానే వున్న స్థలంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించినా ఒక్క అడుగు కూడా విశ్వవిద్యాలయంలోకి వేయలేదు. ఇక ఆ తర్వాత యూనివర్సిటీలో తాత్కాలిక రాజధాని అన్న టాక్ వినిపించినా చంద్రబాబు ఆ ఆలోచన పక్కనబెట్టారు.

chandra-babu-naidu-planning

అసెంబ్లీ తాత్కాలిక సమావేశాలు ఇక్కడే జరుపుదాదామని స్పీకర్ కోడెల అప్పట్లో అనుకున్నప్పటికీ చంద్రబాబు వద్దన్నారని కూడా చెప్పుకుంటారు. యూనివర్సిటీ చుట్టుపక్కల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు ఒక్కసారి కూడా లోపలికి అడుగు పెట్టకుండా తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే ఈసారి ఆయనకి ఓ అగ్నిపరీక్ష ఎదురైంది. అయినా ఆ సెంటి మెంట్ ని వదిలిపెట్టకుండా ఏకంగా భారత రాష్ట్రపతికి ఓ గుడారం వేసేసారు.

cm-chandra-babu

భారతీయ ఆర్ధిక సంఘం 99 వ వార్షిక సదస్సు కిందటి ఏడాది తిరుపతిలో జరిగింది. వరసగా వచ్చే ఏడాది కూడా తామే నిర్వహిస్తామని చంద్రబాబు చొరవ చూపడంతో కేంద్రం ఓకే అంది. ఈసారి 100 వ వార్షిక సదస్సు అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సదస్సుకు రాష్ట్రపతి కోవిద్ తో పాటు ఉద్దండులైన ఆర్ధిక వేత్తలు వస్తున్నారు. రేపు మొదలయ్యే ఈ సదస్సు ఆతిధ్యం ఇవ్వాల్సిన సీఎం చంద్రబాబు సెంటి మెంట్ కి సవాల్ గా నిలిచింది. తొలుత ఈ సదస్సు నాగార్జున యూనివర్సిటీ లో జరపాలని అనుకున్నారు. కానీ బాబు సెంటి మెంట్ రీత్యా సదస్సు వేదికని మార్చారు.

Indian-Economy-Society

యూనివర్సిటీ ఎదురుగా ఒకప్పుడు సీఎం గా చంద్రబాబు ప్రమాణం చేసిన స్థలంలోనే ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. అయితే మహామహులు పాల్గొనే సదస్సు కావడంతో అక్కడ ఏర్పాట్లు ఎలా అన్న సందేహం వచ్చినా, అత్యున్నత నాణ్యత కలిగిన గుడారాల తో సదస్సు పని కానించేస్తున్నారు. ఇక ఈ సదస్సుకి వచ్చే రాష్ట్రపతి కోవిద్ కి కూడా అన్ని హంగులతో తాత్కాలిక గుడారం ఏర్పాటు చేశారు.

ap-chandra-babu-naidu-plann

సహజంగా ఏ మిలిటరీ బేస్ కి వెళ్ళినప్పుడో రాష్ట్రపతి, ప్రధాని లాంటి వాళ్ళు ఇలాంటి గుడారాల్లో ఉండాల్సి వస్తుంది. కానీ అమరావతి కి దగ్గరలో కూడా రాష్ట్రపతి గుడారంలో ఉండాల్సి రావడం వెనుక బాబు సెంటి మెంట్ యే కారణం అనిపిస్తోంది. మొత్తానికి బీజేపీ తో పొత్తు వల్లో, వయసు మీద పడడం వల్లో కానీ చంద్రబాబులో సెంటి మెంట్స్ పెరిగిపోతున్నాయి.

chandra-babu-naidu