జనసేన పార్టీ స్థాపించి నేటికీ 12 సంవత్సరాలు. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఆశించిన ఫలితాలు రాలేదు. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేయకుండా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు.వైసీపీ పాలనలో అక్రమాలు పెరిగిపోతుండడంతో, 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీచేయాలని కృషి చేశారు. మొదట ఈ పొత్తు అసాధ్యమని అందరూ భావించినా, పవన్ కళ్యాణ్ అంకితభావంతో పనిచేసి మూడు పార్టీలను ఏకం చేసి, విజయానికి దారి తీశారు. ఈ నిర్ణయంతో ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా మారి, వైసీపీని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు.