Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్గా బాలీవుడ్లో దూసుకు పోతుంది. ఈమెకు హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌కు కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఒక భారీ చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయ్యింది. స్టార్ హీరోల చిత్రాలు కూడా తెలుగులో 50 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందుతాయి. కాని సన్నీలియోన్‌తో తెలుగులో ఏకంగా 150 కోట్ల బడ్జెట్‌తో సినిమాను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం 150 రోజుల పాటు డేట్లను సన్నీలియోన్ ఇప్పటికే కేటాయించింది. ఛారిత్రాత్మక నేపథ్యంలో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సన్నీలియోన్ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం చేయడం ఇదే ప్రథమం. గతంలో చేసినా కూడా చిన్నా చితకా బడ్జెట్‌తో ఈ అమ్మడు చేసింది. కాని తాజాగా సన్నీలియోన్ చేస్తున్న 150 కోట్ల బడ్జెట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించి తమిళం మరియు హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సన్నీలియోన్‌పై 150 కోట్లు పెట్టడంపై కొందరు తప్పు బడుతున్నారు. నిర్మాతలకు ఏమైనా మైండ్ దొబ్బిందా అంటూ ఎద్దేవ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు అంటున్నారు. ప్రస్తుతానికి సన్నీలియోన్ ఆ చిత్రంలోని పాత్ర కోసం గుర్రపు స్వారి మరియు కత్తి యుద్దం, కర్ర సాములు నేర్చుకుంటుంది. 2019లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి సన్నీలియోన్‌తో 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందబోతున్న ఆ సినిమా ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.