టీడీపీ, జనసేన పొత్తు ,సీట్ల లెక్క తేలినట్టే.

40-seats-finalized-janasena-and-tdp-party-alliance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గడిచిన కొద్దినెలలుగా ఆంధ్రజ్యోతి పత్రికని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చే ఎన్నికల నాటికి ఏ మలుపు తీసుకుంటున్నాయో అర్ధం అయిపోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మనసెరిగిన ఆ పత్రికలో కొన్నాళ్లగా కేంద్రం వల్ల ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న నష్టాన్ని పదేపదే రాస్తున్నారు. ప్రధాన శీర్షికల్లో దాదాపు రోజుకి ఒక ఐటెం అయినా ఇదే కోణంలో వస్తోంది. అంతకుముందు కూడా పరిస్థితి ఇదే అయినా ఆంధ్రజ్యోతి లో ఇన్ని కధనాలు రాలేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో ఎప్పుడైతే మోడీ ప్రాభవం తగ్గుతుందన్న నమ్మకం కుదిరిందో అప్పటినుంచి ఈ ప్రతికూల కధనాల వేడివాడి పెరిగింది. మోడీ వెలిగిపోతున్న రోజుల్లో కేంద్రం ఏమి చేసినా, చేయకపోయినా బీజేపీ తో పొత్తు తప్పదన్న ఆలోచనల్లో చంద్రబాబు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కమలనాధుల్ని వదిలించుకుని జనసేనతో పొత్తు పెట్టుకుంటే మేలని పార్టీ శ్రేణుల నుంచి కూడా ఒత్తిడి వస్తోంది.

నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత అయినా బీజేపీ మనసు మారుతుంది అనుకుంటే అదీ జరగలేదని అర్ధం అయ్యింది టీడీపీకి. ఇప్పటికీ బీజేపీ లో చంద్రబాబు వ్యతిరేక కూటమి యాక్టివ్ గా పనిచేస్తోంది. అవకాశం ఉన్నప్పుడల్లా బాబుని ఇబ్బంది పెడుతూనే వుంది. ఇన్ని అవమానాలు భరించినా రాష్ట్రానికి అదనంగా ఒరిగేది ఏమీ లేదని అర్ధం అయ్యే కొద్దీ బాబు ఆలోచన కూడా జనసేన వైపు మళ్లిందట.

Related image

 

పవన్ , చంద్రబాబు తో దగ్గర సంబంధాలున్న ఓ నాయకుడు ఇటీవల ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ఇద్దరూ సానుకూలంగా మాట్లాడారట. సమయం వచ్చినప్పుడు బయటికి పొత్తు విషయం చెబుదామని అన్నారట. అటు జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తో పొత్తుని ధృవీకరించడమే కాకుండా తాము 40 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని చూచాయగా చెప్పారట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే 40 సీట్ల అంశం హాట్ టాపిక్.