ఇటీవల రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రామ్డంలో ఒకే బస్సులో ప్రయాణిస్తున్న 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బోధనా సిబ్బంది బస్సులో విహారయాత్రకు వెళ్తుండగా ఆ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి 800 అడుగుల లోయలో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి ప్రకాశ్ సావంత్ దేశాయ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడగా మిగిలిన డ్రైవర్ సహా 33 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
అయితే మలుపు తిరుగుతుండగా బస్సు కంట్రోల్ కాక ఈ ప్రమాదం జరిగినట్టు భావించినా బస్సు ప్రమాదానికి వేరే కారణం ఉందని ఆ ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తి పేర్కొన్నాడు. ఓ ప్రయాణికుడు జోక్ వేయడంతో అందురూ పడీ పడీ బిగ్గరగా నవ్వడంతో డ్రైవర్ వెనక్కుతిరిగి చూశాడని, అదే సమయంలో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందని తాను డ్రైవర్ క్యాబిన్ వద్ద కూర్చున్నానని, లోపలి ఉన్న మిగతావాళ్లు బిగ్గరగా నవ్వడంతో డ్రైవర్ వెనక్కు చూడంతో ఇంతలో బస్సు అదుపుతప్పిందని బస్సు లోయలోకి దూసుకెళ్తుండగా ముందుభాగంలోని అద్దం ఊడిపోయిందని, దీంతో అప్రమత్తమై వెంటనే దూకేసి పడిపోకుండా ఓ చెట్టుకొమ్మకు పట్టుకున్నానని దాని సాయంతో పైకి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నానని చెప్పుకొచ్చాడు.