తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత 18 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. సరైన ఆధారాలు చూపించడంతో… గత 18 రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు.
అయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టి వేయడాని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఎస్ ఎల్ పి నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసులు చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు నిన్న ప్రస్తావించగా… ఇవాల్టి మెన్షన్ జాబితాలో చేర్చాలని సూచించారు. దీంతో ఇవాళ ఏం జరుగుతోందన్న ఉత్కంఠ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నెలకొంది. మన వైపు చంద్రబాబు కస్తడి మరియు బెయిల్ పిటిషన్ ల పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.