మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయినటువంటి తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాడు. ఈమధ్య కాలం వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్ లో తన అనుచరలతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని వ్యాఖ్యానించారు.తెల్లం వెంకట్రావుకు కాంగ్రెస్ స్వభావం తెలుసుకునేందుకు నెలకంటే ఎక్కువ సమయం పట్టలేదన్నారు. కేసీఅర్ హయాంలో జల్ …జంగల్ …జమీన్ లో ఏలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ లో వానాకాలం లో కోటి ఎకరాల సాగు జరుగుతోంది. కేసీఅర్ హయాంలో తెలంగాణ
కోటి ఎకరాల మాగణ అయ్యింది తెలంగాణ. ఛత్తీస్ గడ్ లో పొడు భూములకు పట్టాలు ఇచ్చారా ? కానీ ఆ పార్టీ నేతలు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.అక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉంది… కాంగ్రెస్ వాళ్లకు కూడా రైతు బంధు…24 గంటల కరెంట్ వస్తది. కానీ బయటకు వచ్చి కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను నోటికొచ్చినట్టు తిడతారు. యాదాద్రి తరహాలో భద్రాద్రి నిర్మాణం చేపడుతామన్నారు. ఇక వామపక్షాలు ,నక్సలైట్ లు కోరుకున్నట్లు తెలంగాణ లో అభివృద్ధి జరుగుతుందని కేటీఆర్ తెలిపారు .