పెండ్లి మండపంలోకి దూసుకెళ్లిన ట్రక్కు: 8 మంది మృతి

a speeding truck lost the control and rammed into a wedding pandal

బిహార్: రాష్ట్రంలోని లఖీసరాయ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పెండ్లి జరుగుతుంది. రోడ్డుపై వెళుతున్న ట్రక్కు అదుపు తప్పి మండపంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.