రూ.369 కోట్ల పెంట్‌హౌస్

james dyson buys singapore penthouse

సింగపూర్: సింగపూర్‌లో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన పెంట్‌హౌస్‌ను బ్రిటన్ వ్యాపారవేత్త జేమ్స్ డైసన్ కొనుగోలు చేశారు. 64 అంతస్తులు, 290 మీటర్ల ఎత్తు ఉన్న వాల్లిచ్ రెసిడెన్సీలోని పెంట్‌హౌస్‌ను రూ.369 కోట్లకు కొన్నారు. 21వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ పెంట్‌హౌస్‌లో మూడు అంతస్తులు, 5 బెడ్‌రూంలు, గార్డెన్, స్విమింగ్ ఫూల్, టెర్రస్, ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాలున్నాయి. ఈయూ నుంచి వైదొలగాలని బ్రిటన్ నిర్ణయించడంతో డైసన్ తన విద్యుత్ ఉపకరణాల కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని బ్రిటన్ నుంచి సింగపూర్‌కు తరలిస్తున్నారు. మా కంపెనీ అభివృద్ధి కోసం ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్‌కు తరలిస్తున్నాం. ఇందులో భాగంగానే పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశాం అని తెలిపారు.