సోషల్‌మీడియాపై టీఆర్‌ఎస్ శిక్షణ

workshop on social media

సోషల్‌మీడియా వినియోగంపై టీఆర్‌ఎస్ పారీ శిక్షణ కార్యక్రమం చేపట్టింది. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ విద్యార్థి, యువజన విభాగం నాయకులకు బుధవారం తెలంగాణభవన్‌లో సోషల్‌మీడియా సద్వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ.. సాంకేతిక పురోగతికి అనుగుణంగా విద్యార్థులు, యువత మార్పుచెందాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ప్రవీణ్ పాల్గొన్నారు.