జగన్ తో సేల్ఫీ…అసలు విషయం ఆమే బయటపెట్టింది !

actress alekhya clarifies about her selfie with jagan

ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ‘ఏపీ బంద్’ సందర్భంగా ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌పై నలుగురు పెళ్ళాలు అంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే జగనా విమర్శలు చేశాడో ఆ మరుసటి క్షణం నుంచి సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ అభిమానులు వర్సెస్ పవన్ అభిమానులుగా పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతోంది. జగన్ సోదరి షర్మిల గురించి చెప్పలేని విధంగా రాస్తున్న పవన్ అభిమానులు, జగన్ వేరొక యువతితో ఉన్న పిక్ ని కూడా షేర్ చేస్తూ ఏవేవో రాస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే గతంలో ఓ క్రైస్తవ భక్తిగీతాల సీడీని జగన్ గత సంవత్సరం తన లోటస్ పాండ్ నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అలేఖ్య తన కుటుంబ సభ్యులతో సహా హాజరై సెల్ఫీ దిగి, అప్పట్లోనే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోలను చూసిన పవన్ అభిమానులు కొందరు వారిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ సృష్టించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ ఫొటో వైరల్ అవుతుండటం… ట్రోల్స్ వస్తుండటంతో ఎట్టకేలకూ ఈ మొత్తం వ్యవహారం పై స్వయాన అలేఖ్య స్పందించి వివరణ ఇచ్చుకుంది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసిన పని చాలా ఘోరమైన పాపమని, ఇదే పనిని మీ అక్క లేదా చెల్లెలు ఇమేజ్ పెట్టి, ఇలాంటి ప్రచారమే చేస్తే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవాలని మండిపడింది. జగన్ తండ్రిలాంటివాడని, పెద్దన్నయ్య లాంటివాడని పేర్కొన్న అలేఖ్య సీడీ లాంచింగ్‌కు తన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారని పేర్కొంది. మిగతా వారితో కలిసి జగన్‌ను రిక్వెస్ట్ చేసి మరీ సెల్ఫీ తీసుకున్నామని వివరించింది. ఓ అమాయకురాలైన అమ్మాయిపై, మరొకరి కూతురిపై, ఇంకొకరి సోదరిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి మనస్తాపానికి గురిచేయడం సరైనదేనా? అని ఆలోచించుకోవాలని హితవు పలికింది.’ఇల్లేమో దూరం… అసలే చీకటి గాడాంధకారం… దారి అంతా గతుకులు… చేతిలో దీపం లేదు కానీ, గుండెల నిండా ధైర్యం ఉంది. నేనెప్పుడైనా ఒత్తిడికి లోనైనప్పుడు ఈ మాటలనే గుర్తు చేసుకుంటాను. ఇవి నన్ను చాలా ప్రభావితం చేస్తాయి.ఆ ధైర్యంతోనే మీరు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్న ధైర్యాంగా ఉన్నా. ఉండగలిగా’ అని అలేఖ్యా ఏంజెల్ వ్యాఖ్యానించింది. తాను కూడా పవన్ అభిమానినేనని, ఆయన మానవత్వం గల మనిషి అని పేర్కొంది. ఓ నటుడుగా ఆయన తనకు ఆదర్శమని, అటువంటి వారి గౌరవాన్ని ఇటువంటి పోస్టులు పెట్టి దెబ్బతీయవద్దని పవన్ అభిమానులకు సూచించింది.