Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాట కొత్త రాజకీయాలకు తెర లేపిన కమల్ హాసన్ మార్పు కోసం ప్రజా పోరాటం చేస్తానంటున్నాడు. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో తాము పాగా వేయాలని బీజేపీ కలలు కనడం జరిగింది. రజినీకాంత్ ద్వారా ఆ కలలను సాకారం చేసుకోవాలని ప్రయత్నాలు చేసింది. కాని బీజేపీ కలలను కల్లలుగా మార్చేసి కమల్ కొత్త పార్టీ పెట్టాడు. కమల్ పార్టీ పెట్టడంతో బీజేపీ అధినాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. కమల్ రాజకీయ పార్టీ కారణంగా తమిళనాడులో బీజేపీకి మరింతగా కష్టాలు ఉండే అవకాశం ఉందని స్థానిక నాయకత్వం భావిస్తుంది. ఈ సమయంలోనే కమల్‌ను రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు, వ్యక్తిగతంగా కూడా దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సుదీర్ఘ కాలం పాటు కమల్ హాసన్, గౌతమిలు సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. కొన్ని కారణాల వల్ల ఈమద్యే గౌతమి విడిపోతున్నట్లుగా ప్రకటించి కమల్‌కు దూరం అయ్యింది. కమల్ హాసన్ కూడా గౌతమికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. గౌతమి గత కొంత కాలంగా బీజేపీకి సన్నిహితంగా ఉంటూ వస్తుంది. అందుకే మోడీ డైరెక్షన్ మేరకు కమల్‌ను గౌతమి ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కమల్ హాసన్ చేసిన పలు చిత్రాలకు తాను కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మరియు ఇంకా పలు పనులు చేశాను అని, వాటికి సంబంధించిన పారితోషికాలు తనకు ఇవ్వలేదని, కమల్ తనకు బాకీ పడ్డాడు అంటూ తాజాగా గౌతమి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం కమల్‌ను చిక్కుల్లో పడేశాయి.