నా నడుము గిల్లాడని చావా చితకగొట్టా…!

Actress Hema Slapped A Person Who Misbehaved With Her

సినీ నటి హేమ లేటెస్ట్ ఇంటర్వ్యూ‌కి సంబంధించిన ప్రోమో యూ ట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఓ పాపులర్ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు హేమ. త్రివిక్రమ్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదు, దర్శకుడు పూరీ జగన్నాధ్ – చార్మీ రిలేషన్‌ గురించి.. సీనియర్ నటి రమాప్రభతో వివాదం, తనపై వచ్చిన రూమర్స్ తదితర విషయాలను ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించడంతో ఈ వీడియో ఇప్పటికే ఐదులక్షల వ్యూస్‌కి చేరువై వైరల్ అవుతుంది. ఇక తన నడుము గిల్లిన వ్యక్తుని చావా చితక కొట్టినట్టు ఆమె పేర్కొన్నారు. వందలాది మంది జనం శ్రీహరి గారు చనిపోయినప్పుడు ఆయన్ని చూడటానికి తోసుకుంటూ వెళ్తున్నారని, అక్కడ చాలా ఇరుకుగా ఉందని ఆ టైంలో ఎవడో నా నడుము పట్టుకుని గిల్లాడు. వెంటనే వాడిని పట్టుకుని తుక్కు తుక్కు కింద బాదేశా. దబా దబా మని సౌండ్‌లు వచ్చేట్టు చితక్కొట్టా. దెబ్బకి నేను వెళ్లడానికి దారి ఇచ్చేశారంటూ’ ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు హేమ.