పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రం ప్రత్యేక షోను కేసీఆర్ మరియు పలువురు మంత్రులు చూడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను దర్శకుడు త్రివిక్రమ్ మరియు నిర్మాత రాధాకృష్ణ కలిసి షోను చూడాల్సిందిగా కోరడం జరిగింది. సీఎం కేసీఆర్‌తో మంత్రి తసాని మాట్లాడి ఓకే అన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈనెల 10వ తారీకున లేదా అంతకు ముందే కేసీఆర్ మరియు కుటుంబ సభ్యులు సినిమాను చూసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విషయం తెల్సిందే. వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ సమయంలో పవన్‌పై కేసీఆర్ చూపించిన అభిమానం అంతా ఇంతా కాదు. డిన్నర్ చేసి వెళ్లాలని కేసీఆర్ స్వయంగా పవన్‌ను కోరడం అందుకు పవన్ సున్నితంగా తిరష్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్‌తో కేసీఆర్ సన్నిహితంగా వ్యవహరించిన కారణంగా ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని చూడాల్సిందిగా త్రివిక్రమ్ మంత్రులను మరియు సీఎంను కోరడం జరిగింది. భారీ అంచనాలున్న అజ్ఞాతవాసి చిత్రంలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్, అను ఎమాన్యూల్‌లు నటించిన విషయం తెల్సిందే.