రొటీన్ కథాంశాలకు భిన్నంగా తెరకెక్కిన ‘మాయా పేటిక’ మూవీ పాయింట్, ఈ… సినిమా లో నటించిన టాలెంటెడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు ఈ సినిమా లో నటించారు. మంచి కథనం, నటీనటుల పెర్ఫామెన్స్, విభిన్నంగా సాగే కథనం ఆడియెన్స్‌కు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది.
ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ ఆహా. ఈ సెప్టెంబర్ 15, శుక్రవారం నుంచి అందరిలో ఆసక్తిని రేకెత్తించి అలరించిన వైవిధ్యమైన చిత్రం ‘మాయా పేటిక’*ను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ చిత్రాన్ని రమేష్ రాపర్తి డైరెక్ట్ చేశారు.
ఇక మూవీ కథ విషాయనికి వస్తే.. ఒక నిర్మాత టాలీవుడ్ స్టార్ పాయల్ (పాయల్ రాజ్‌పుత్)కి ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను బహుమతిగా ఇస్తాదంట . ఆ స్మార్ట్ ఫోన్ చుట్టూ తిరిగే కథతో మూవీ తెరకెక్కింది. ఆ ఫోన్లో అద్భుతమైన ఫీచర్స్‌ను గమనించిన పాయల్ తనకు తెలియకుండానే ఫోన్‌తో అనుబంధాన్ని ఏర్పరుచుకుంటుందంట . అయితే అనుకోని సమస్య రావటంతో ఆమె ఫోన్‌ని తన అసిస్టెంట్‌కు ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి స్మార్ట్ ఫోన్ తన సాహసయాత్రను కొనసాగించటం మొదలు పెడుతోంది . ఒక్కొక్కరి చేతులు మారుతూ వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల చేతుల్లోకి ఫోన్ చేరుతుంది . ఆ ఫోన్‌ను సొంతం చేసుకున్న ప్రతీ వ్యక్తి అనిర్వచనీయన అనుభూతికి లోనవుతాదంట . మరి ఇది మన ఈ ఫోన్ చేతుల్లో ఉండటం అనేది వరమా? లేదా శాపమా? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది.