రూ. 3.7ల‌క్ష‌ల విలువైన గౌను వేసుకున్న ఐశ్వ‌ర్య

Aishwarya Rai Bachchan attended Ambani Dinner party in 3.7 Lacks Lovely Gown

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్ర‌యివేట్ పార్టీల్లో ఈ మ‌ధ్య ఐశ్వ‌ర్యారాయ్ వేసుకుంటున్న డ్రెస్ లు ట్రెండీగా ఉంటూ టాక్ ఆఫ్ ద బి టౌన్ అవుతున్నాయి. 44 ఏళ్ల వ‌య‌సులోనూ ఐశ్వ‌ర్య త‌న అందం, స్ట‌యిల్ తో అద‌ర‌హో అనిపించుకుంటున్నారు. వేడుక‌కు త‌గ్గ‌ట్టుగా డ్రెస్ చేసుకుని సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా ఉంటున్నారు. ఇటీవ‌లే బంధువుల పెళ్లికి కూతురు ఆరాధ్య‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు ఐశ్వ‌ర్య‌. ఆ వేడుక‌లో సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన డ్ర‌స్ లో క‌నిపించిన ఐశ్వ‌ర్య‌ను చూసి ఎవ‌రూ క‌ళ్లుతిప్పుకోలేక‌పోయార‌ట‌. అంతేకాదు… ఐశ్వ‌ర్య‌, ఆరాధ్య ఇద్ద‌రూ ఒకే క‌ల‌ర్, ఒకే టైప్ దుస్తులు ధ‌రించి… బంధువుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

తాజాగా శుక్ర‌వారం అంబానీ నివాసంలో జ‌రిగిన ఓ పార్టీకి భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ తో క‌లిసి వెళ్లారు ఐశ్వ‌ర్య‌. ఈ పార్టీలో ఐశ్వ‌ర్య వేసుకున్న ప‌సుపు రంగు గౌన్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ట్రెండీగా ఉన్న ఈ గౌన్ ఫొటోల‌ను ఐశ్వ‌ర్య స్టైలిస్ట్ ఆస్తా శ‌ర్మ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌డంతో అవి నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఐశ్వ‌ర్య గౌన్ పై ఇంత‌గా చ‌ర్చ జ‌ర‌గ‌డానికి కార‌ణం ఆ గౌను ఖ‌రీదు. ఐష్ ను స్టైల్ ఐకాన్ గా చూపిస్తున్న ఈ పొడ‌వు గౌను ధ‌ర అక్ష‌రాలా 3.7 ల‌క్ష‌లు. అంబానీ నివాసంలో జ‌రిగిన ఓ సాధార‌ణ పార్టీకి ఐశ్వ‌ర్య ఇంత ఖ‌రీదైన దుస్తులు ధ‌రించి హాజ‌రు కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.