జ‌గ‌న్‌తో నాగార్జున భేటి.. అస‌లు సంగ‌తి ఏంటో …?

Akkineni Nagarjuna Meets Ysrcp Chief Ys Jagan At Lotus Pond Hyderabad
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ టాప్‌గేర్‌లో దూసుకుపోతుంది. క‌రెక్ట్ టైమ్‌లో ఎన్నికల వ్యూహాల‌తో అధికార తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ క్ర‌మంలో కొద్ది రోజులుగా వైసీపీలో జోరుగా వ‌ల‌స‌లు పెరిగాయి. ముఖ్యంగా టీడీపీ నుండే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి వైసీపీలో చేరుతున్నారు. ఇక మ‌రి కొంద‌రు కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక తాజాగా సినీ న‌టుడు అక్కినేని నాగార్జున తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌ల‌వ‌డం సినీ, రాజ‌కీయ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. గ‌త కొద్ది రోజులుగా అక్కినేని అమ‌ల, నాగార్జున ఇద్ద‌రు వైసీపీలో చేరుతార‌నే వార్త‌లు జోరుగా ప్ర‌చారం అయ్యాయి.
అమ‌ల అయితే వైసీపీ నుండి ఎంపీగా పోటీ చేస్తుంద‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే అక్కినేని ఫ్యామిలీ నుండి మాత్రం ఎలాంటి స్పంద‌న రాలేదు. కానీ తాజాగా లోట‌స్‌పాండ్‌లో జ‌గ‌న్‌ను నాగార్జున క‌ల‌వ‌డంతో, మ‌రోసారి నాగార్జున వైసీపీలో చేర‌తారంటూ ప్ర‌చారం స్టార్ట్ అయ్యింది. ఇక సోమవారం జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస‌రావు జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం, ఈ రోజు నాగార్జున కూడా జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం రాజకీయ‌ విశ్లేష‌కులకి కూడా అంతు చిక్కడం లేదు.  ఎంపీ సీటును తనకు కావాల్సిన వ్యక్తికి ఇవ్వాలని జగన్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరన్నది ఆసక్తిగా మారగా ఓ బడా వ్యాపారవేత్తనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఎవరో కాదు మాట్రిక్స్ ప్రసాద్ అనబడే నిమ్మగడ్డ ప్రసాద్, ఈయన గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో జైలులో కూడా ఉంది వచ్చాడు.