హాస్యనటుడు అలీ వైసీపీ గూటికి చేరారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేయాలని అలీ ఆశించారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతోనే అలీ వైసీపీలో చేరారని అంటున్నారు. ఇప్పటికే ఆయన వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో వరుసగా భేటీ అయ్యారు. నిన్న మొన్నటి వరకూ కూడా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.
అయితే అందరికీ షాకిచ్చిన అలీ సడన్‌గా వైసీపీ గూటికి చేరుతుండటం అనేక ప్రశ్నలకి తావిస్తోంది. ఈ ప్రశ్నలకి సమాధానంగా అలీ జగన్ వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు నమ్ముతున్నారని నేను ఆయన్ని గతంలో కలిసి మాట్లాడానని ఆయన నన్ను రమ్మని ఆహ్వానించారనీ కానీ తానే కొంత సమయం కావాలని కోరానని అన్నారు. 1999లో ఓ పార్టీ కండువా కప్పుకున్నానని మళ్లీ 2019 ఈ పార్టీ కండువా కప్పుకున్నానని ఖచ్చితంగా మంచి మెజారిటీతో జగన్‌ని సీఎం చేయడమే తన ధ్యేయమని అలీ అన్నారు. అయితే టికెట్ గురించి ప్రశ్నించగా పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ చాలా మందికి హామీ ఇచ్చిన కారణంగా తనకు టికెట్ ఇవ్వలేనని చెప్పారని అందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని అలీ చెప్పారు.
మంత్రి కావాలన్నది నా కల,పదవి ఇస్తానన్న పార్టీ లో చేరుతానన్న మాట మీదే నిలబడి వున్నానని ఆయన అన్నారు. అయితే ఓకవేళ పార్టీ గెలిస్తే అలీని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చి ఉండచ్చని అందుకే ఆయన పార్టీలో చేరి ఉండచ్చని అంటున్నారు.