Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రానా, కాజల్ జంటగా తెరకెక్కి, ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్స్‌ను సాధిస్తూ ఈ చిత్రం దూసుకు పోతుంది. ‘బాహుబలి’ని పక్కన పెడితే రానా కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచిపోనుంది.ఇలాంటి సమయంలో ఈ చిత్ర కథ వివాదాస్పదం అవుతూ వస్తుంది. రెండు సంవత్సరాల క్రితం ఈ కథను తిమ్మ అనే రచయిత తేజకు వినిపించడం జరిగిందని, దానికి చిన్న చిన్న మార్పులు చేసి తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, కాని టైటిల్ కార్డ్స్‌లో మాత్రం అతడి పేరు వెయ్యలేదు అనేది విమర్శ.
సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జరుగుతున్న చర్చకు చిత్ర యూనిట్ సభ్యులు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయమై స్పందిస్తు.. ఈ చిత్ర కథ తిమ్మ అనే రచయితది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అని, అసలు అతడు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు, చాలా రోజుల క్రితం తేజకు ఆయన కథ చెప్పిన మాట వాస్తవమే.అందులోంచి చిన్న లైన్ తీసుకోవడం జరిగింది. అందుకు ఆయనకు చెందాల్సిన మొత్తంను ఇవ్వడం జరిగింది. ఆయనతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. స్టోరీ మొత్తం డెవలప్ చేసింది తేజ కనుక టైటిల్ కార్డ్స్‌లో తేజ పేరు వేయించుకోవడం జరిగింది. కాని ఇప్పుడు సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఆయన డైరెక్ట్‌గా కాకుండా పరోక్షంగా ఆ కథ నాది అంటూ తెరపైకి వచ్చాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని వార్తలు: