Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. రెండవ సీజన్‌ను ప్రారంభించేందుకు స్టార్ మా వారు ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్టీఆర్ తాను వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా తాను రెండవ సీజన్‌ను చేయలేను అంటూ తేల్చి చెప్పాడు. దాంతో ఏం చేయాలో పాలుపోని షో నిర్వాహకులు మాటీవీలో భాగస్వామి అయిన అల్లు అరవింద్ సలహా తీసుకున్నారు. ఆయన మారు మాట్లాడకుండా ఎన్టీఆర్ కాకుంటే నాని అయితే బిగ్‌బాస్ షోకు మంచి న్యాయం చేస్తాడని అనుకున్నాడు. ఆయన అనుకున్నట్లుగానే నానిని సంప్రదించాడు. నానికి విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పిన అల్లు అరవింద్ ఒప్పించాడట.
మొదట నాని తాను బిగ్‌బాస్‌కు న్యాయం చేయగలనా అంటూ అనుమానాలు వ్యక్తం చేసి, తన వల్ల కాదని అన్నాడట. కాని అల్లు అరవింద్ ప్రోత్సహించి, ధైర్యం చెప్పి, నువ్వు మాత్రమే చేయగలవు అంటూ ప్రోత్సహించాడట. అల్లు అరవింద్ ప్రోత్సాహంతోనే నాని ఈ షోకు కమిట్ అయినట్లుగా చెప్పుకొచ్చాడు. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 2 ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్‌మీట్‌లోనే నాని ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అు్ల అరవింద్‌కు ఎందుకు నాని అయితేనే ఈ షోకు న్యాయం చేయగలడు అనిపించింది అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. తన ఫ్యామిలీలోనే పలువురు హీరోలు ఉన్నారు. ఇంకా కూడా అనే మంది హీరోలు ఉన్నారు. అయినా కూడా వారిని కాదని నానిపైనే ఎందుకు అల్లు అరవింద్ నమ్మకంను వ్యక్తం చేశాడు అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ.