బిగ్ బాస్ కాదు…బిగ్ మసాలా !

Interesting News On Nani Bigg Boss 2

బిగ్ బాస్‌ సీజన్ 2 మొదట్లో. ఈ సారి కొంచెం మసాలా అని నాని అంటే ఏమో అనుకున్నారు కానీ నిజంగానే ఈసారి బిగ్ బాస్ లో మసాలా ఎక్కువ ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నారు. రొమాన్స్, ఎమోషన్స్, యాక్షన్, ఐటమ్ సాంగ్స్, లవ్ ప్రపోజల్స్, లవ్ మెమొరీస్ ఇలా ఒక్కటేమిటి నవరసాల్ని పిండేస్తున్నారు కంటెస్టెంట్స్ నుండి. ఇక స్వతహాగా అందరూ నట వాతాగానికే చెందినవారు కావడంతో ఒకర్నిమించి ఒకరు రెచ్చిపోయి నటించేస్తున్నారు. తాజా బిగ్ బాస్ టాస్క్‌లో భాగంగా ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ సినిమాను హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీర లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈవారం లగ్జరీ బడ్జెట్ భాగంగా ‘బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ మూవీ’ అనే ఎనర్జిటిక్ టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఓ కథను రెడీ చేసి ఆ కథకు అనుగుణంగా క్యారెక్టర్స్‌ని ఎన్నుకుని అందుకోసం ఆడిషన్స్ కూడా నిర్వహించి క్యారెక్టర్స్‌ని ఫైనల్ చేశారు.

సినిమా ప్రారంభం అయ్యిన నాటి నుండి తమ పెర్ఫామెన్స్‌తో కంటెస్టెంట్స్ ఆదరకోడుతున్నారు. కథలో భాగంగా కౌశల్.. నందినికి లవ్ ప్రపోజ్‌ అండ్ రొమాంటిక్ సీన్స్ అదుర్స్ అనిపించారు. కౌశల్‌ తన ప్రేమను వ్యక్తపరచడం నందిని అదే రీతిలో సిగ్గుపడుతూ అతడి ప్రపోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి స్ట్రాంగ్ హగ్ ఇవ్వడంతో రొమాంటిక్ సీన్స్ బాగా పండాయి. ఇక ఐటమ్ సాంగ్‌లో భాగంగా రింగా సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దీప్తి సునైనా పాటకి తగ్గ క్యాస్ట్యూమ్స్‌ డాన్స్‌తో రచ్చ చేసేసింది. సామ్రాట్‌ని డామినేషన్ చేస్తూ బిగ్ బాస్ హౌస్‌ని మాస్ స్టెప్పులతో షేక్ చేసింది. చివర్లో సామ్రాట్ బుగ్గపై ముద్దును కూడా ఇచ్చేసింది దీప్తి. ఈ విధంగా ఇప్పుడు ఇది బిగ్ బాస్ లా కాకుండా బిగ్ మసాలా బాస్ గా మారుతుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.