మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతటి స్టార్‌డం తెచ్చుకున్నాడో, అదే స్థాయిలో అల్లు అరవింద్ నిర్మాతగా తనకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. చిరంజీవి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగడానికి అల్లు అరవింద్ పాత్ర కీలకం అని చెపపడంలో సందేహం లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా సుదీర్ఘ ప్రస్థానంను కలిగి ఉన్న అల్లు అరవింద్‌కు తాజా పరిణామాలతో సినిమా ఇండస్ట్రీ నుండి బయటకు వెళ్లి పోవాలన్నంత కోపంగా ఉందట. స్వయంగా అల్లు అరవింద్ తాను ఇండస్ట్రీలో ఉండాలనుకోవడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మెగా ఫ్యాన్స్‌లో చర్చకు తెర లేపింది. అల్లు అరవింద్ సంచలన నిర్ణయానికి కారణం గీత గోవిందం సినిమా వీడియో లీక్ అంటూ మెగా వర్గాల వారు చెబుతున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల కాకుండానే నిన్న, మొన్ననే సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన వీడియోలు లీక్ అయ్యాయి. గూగుల్ డ్రైవ్‌లో సినిమా 90 శాతం ఉన్నట్లుగా తెలిసింది. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కాని సినిమాకు జరగాల్సిన నష్టం జరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై అల్లు అరవింద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాలు ఇలా లీక్ అయితే నిర్మాతల భవిష్యత్తు ఏంటీ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారం లేదా అంటూ సినీ వర్గాల వారు ఆందోళనతో ఉన్నారు. అల్లు అరవింద్‌కు బాసటగా పలువురు నిర్మాతలు నిలిచారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ దిల్‌రాజు స్వయంగా అల్లు అరవింద్‌ను కలిసి ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తోంది.