మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున భారీ నమ్మకం పెట్టుకుని చేసిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఆర్మీ ఆఫీసర్ పాత్ర కోసం బన్నీ ఏ రేంజ్లో కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చడంతో బన్నీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. పలు విధాలుగా ఆలోచించి తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు. ‘హలో’ చిత్రం వంటి విభిన్న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విక్రమ్ కుమార్ తాజాగా అల్లు అర్జున్‌తో మూవీ కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ను సిద్దం చేయడం జరిగింది.
తన సినిమాన్నింటిలో కూడా విభిన్నమైన నేపథ్యంను చూపించే విక్రమ్ కుమార్ తాజాగా ఈ చిత్రం కోసం కూడా తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యానుభూతులకు లోనయ్యే నేపథ్యంను తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో డబుల్ రోల్లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఎప్పుడు కూడా డబుల్ రోల్లో కనిపించింది లేదు. కెరీర్లో మొదటి సారి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ డబుల్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘24’ చిత్రంలో సూర్య ట్రిపుల్ రోల్లో కనిపించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్రం కూడా అల్లు అర్జున్‌కు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమాను ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.